Mahaa Daily Exclusive

  జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటాం:సీఎం రేవంత్ రెడ్డి

Share

  • జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటాం
  • హైదరాబాద్ ప్రెస్ క్లబ్ డైరీ
    ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా:
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ 2026 సంవత్సరానికి రూపొందించిన నూతన డైరీ ని ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, వారి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు ఏ .రాజేష్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రెటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్దేల్లిబాపూరావు, ఈసీ సభ్యులు ఎన్ .ఉమాదేవి, మర్యాద రమాదేవి, రాజేశ్వరి కళ్యాణం, శంకర్ సిగ, ముత్యాల సత్తిబాబు, నాగరాజు వనం, ఎన్. శ్రీనివాసరెడ్డి ,అశోక్ దయ్యాల, అమిత్ బట్టు సహా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పూర్వ ప్రధాన కార్యదర్శి ఆర్. రవి కాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Latest