- మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్
- డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేత బర్సె దేవా
- మావోయిస్టు ప్రాంతంగా మారిన బస్తర్
హైదరాబాద్, మహా : వరుస దెబబలతో రోజురోజుకూ కూనరిల్లుతోన్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదరు దెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టు నేతల పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పలువురు కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించడం, పార్టీ బలహీనపడటం, ఆరోగ్య సమస్యలు ఇతరత్రా కారణాలతో గత సంవత్సరం వందల్లో మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవచ్చు. తాజాగా మరోసారి మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. మరో కీలక నేత పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం మావోయిస్టు ముఖ్య నేత బర్సే దేవా.. డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. మావో అధినేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. డీజీపీ ముందు దేవా లొంగిపోగా అతడి నుంచి మౌంటెన్ ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. బర్సే దేవాతో పాటు లొంగిపోయిన వారందరినీ శనివారం మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. దేవా లొంగిపోవడం, తదితర వివరాలను డీజీపీ మీడియా సమావశంలో వెల్లడించనున్నారు.
వాస్తవానికి గత రెండు మూడు రోజులుగా మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బార్సె దేవా, మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారు జరగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్‌జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు హాని ఉందని, హిడ్మాలాగే ఆయననూ ఎన్‌కౌంటర్ చేయనున్నారని పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కోరుట్లకు చెందిన దేవ్‌జీ కుటుంబం సైతం ఆయన జాడ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో సడన్ గా ఆయన డీజీపీ ఎదుట లొంగిపోవడం గమనార్హం.
మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్?
బర్సె దేవాతో పాటు పలువురు మావోయిస్టులు లొంగిపోవడంతో గత కొన్నేళ్ళుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంతం మావోయిస్టు రహితంగా మారనుంది. డీజీపీ ఎదుట బర్సె దేవా లొంగిపోవడం, ఆయనతో పాటు మరికొంత మంది మావోయిస్టులు సరెండర్ కావడంపై పరిశీలి్తే లొంగిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు కేడర్లేనని సమాచారం. వీరి లొంగుబాటుతో దాదాపుగా బస్తర్ ప్రాంతం మావోయిస్టు రహితంగా మారినట్లేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం బస్తర్ ప్రాంతంలో ప్రభుత్వ బలగాల ఆధిపత్యం, ఆపరేషన్ కగార్ దాడి తీవ్రత రీత్యా మావోయిస్టులు తిరగలేని పరిస్థితి ఉంది. వారికి ఆహారం, ఇతర సామగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా కేడర్లందరినీ ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లమని నాయకత్వం ఆదేశాలిచ్చినట్లుగా సమాచారం. అలా వచ్చిన కొంత మంది ఆ మధ్య ఆదిలాబాద్‌లో ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేవా తదితరులు కూడా అదే బాటలో నడిచారంటున్నారు. దేవ్‌జీ, ఆయన రక్షణ సిబ్బంది, ఇంకా మిగిలిన పాపారావు లాంటి నేతలు కూడా తెలంగాణకే వచ్చారా? అన్న విశ్లేషణ నిఘా వర్గాల్లో జరుగుతోంది.








