ప్రజల సంక్షేమమే తమ ద్వేయం…
నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యం: ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన, ఇబ్రహీంపట్నం మండలం ఎమ్మార్వో కార్యాలయాన్ని, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని, నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో అనంతరెడ్డి, ఎమ్మార్వో సునీత, ఏసీపి కేపివి రాజు, డిఈ, సిఐ మహేందర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, భూపతిగల్ల మహిపాల్, ముత్యాల రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 87







