Mahaa Daily Exclusive

  తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ

Share

  • తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ
  • 20మంది ఐపిఎస్ లు.. నలుగురు ఐఎఎస్ లకు స్థానచలనం

హైదరాబాద్, మహా
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 20మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతి నియమితులయ్యారు. లాజిస్టిక్స్‌ ఐజిగా గజారావు భూపాల్‌, ఇంటెలిజెన్స్‌ డిఐజిగా ఆర్.భాస్కరన్‌, ఫ్యూచర్ సిటీ అడిషనల్‌ సీపీగా చందన దీప్తి, సైబరాబాద్‌ డిసిపిగా టి.అన్నపూర్ణ, ట్రాఫిక్‌-3 డిసిపిగా రాహుల్‌ హెగ్డే బదిలీ అయ్యారు. అలాగే సీఐడి ఎస్పీగా ఆర్.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ క్రైమ్‌ డీసీపీగా ఎస్.చైతన్యకుమార్‌, ట్రాఫిక్‌-1 డీసీపీగా అవినాష్‌ కుమార్‌, ట్రాఫిక్‌-2 డీసీపీగా కాజల్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌ డీసీపీగా శేషాద్రిని రెడ్డి, మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ డీసీపీగా రాహుల్‌ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ డీసీపీగా శివం ఉపాధ్యాయ, మల్కాజ్‌గిరి ట్రాఫిక్‌-2 డీసీపీగా వి.శ్రీనివాసులు బదిలీ అయ్యారు.

ఆసిఫాబాద్ కలెక్టర్ గా హరిత
తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా కే.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కే.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్, యాదాద్రి ఆలయ ఈవోగా భవానీ శంకర్‌లకు బాధ్యతలు అప్పగించారు