ఆదిలాబాద్ మహా: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి ఆయనకు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం తో ముందడుగు వెయ్యాలని కంది శ్రీనివాస రెడ్డి కోరారు. రాష్ట్ర స్థాయి లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి లోను రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. 33 జిల్లాలనుండి వచ్చిన విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ ని సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ గెడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడె గజేందర్ తదితరులు పాల్గొన్నారు.








