- బిజెపికి గుడ్ బై చెప్పిన దోర్నాల ప్రదీప్..
- విద్యార్థి దశ నుండి సుదీర్ఘకాలం పనిచేసిన ప్రదీప్
- స్వలాభం కోసం కొందరి వ్యక్తుల వెక్కిలి చేష్టలు
- పార్టీ సిద్ధాంతాలను వక్రీకరించే వాళ్ళతో ఉండలేం.!
రంగారెడ్డి జిల్లా మహా:
ఖానాపూర్ గ్రామానికి చెందిన దోర్నాల ప్రదీప్ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో పనిచేసి అనంతరం బీజేవైఎం బిజెపిలో సుదీర్ఘకాలం ప్రదీప్ పనిచేశారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రదీపుపై, పార్టీ మున్సిపాలిటీ నాయకులకు తప్పుడు సమాచారాలను అందించి పార్టీ నుంచి వైదొలిగించాలని కుట్రలు చేస్తున్నారని ప్రదీప్ ఆరోపణలు చేశారు. పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడం కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, గ్రామంలో పార్టీ పరువు తీస్తూ వ్యవహరిస్తున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రదీప్ ను పార్టీ వదులుకోవడం పార్టీకే నష్టం వాటిల్లుతుందని తనకు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం లేదన్నారు. కావున ఇలాంటి వాళ్ళతో పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదు అనే ఆలోచనతో తానే బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి తన భవిష్యత్తు ఏంది అనేది త్వరలో తెలియజేస్తానని ఆయన ఒక మాటలో తెలిపారు.








