Mahaa Daily Exclusive

  లక్నోలో తెలంగాణ శాసన మండలి బృందం పర్యటన: చారిత్రక కట్టడాలను సందర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

Share

లక్నో నగరాన్ని సందర్శించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ , లేజిస్లేచర్ బృందం

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు , తెలంగాణ శాసన మండలి సెక్రెటరీ డా. నరసింహా చార్యులు , తెలంగాణ శాసన సభ సెక్రెటరీ ఆర్ . తిరుపతి , తెలంగాణ లేజిస్లేచర్ ఆఫీసర్లు , ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సిటీలో పర్యటించారు.

86 వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్సీ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తెలంగాణ లేజిస్లేచర్ బృదం నిన్న లక్నో సిటీకి చేరుకున్నారు.

స్టడీ టూర్ లో భాగంగా నేడు లక్నో నగరంలోని ప్రసిద్ధ ప్రాంతాలు అయిన బార ఇమాం బార ,
బుల్ బులయియా , మరియు చోట ఇమాం బార , క్లాక్ టవర్ లను సందర్శించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ ఓ.యస్ .డి
వి. గోవర్ధన్ రెడ్డి , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పియస్ బి. యాదగిరి , తదితరులు పాల్గొన్నారు.