Mahaa Daily Exclusive

  కొండకల్ గ్రామంలో వింత ఘటన.. పొలంలో అకస్మాత్తుగా కుంగిన భూమి…

Share

 

శంకర్ పల్లి, మహా : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో శుక్రవారం ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు రోజువారీ పనుల నిమిత్తం తన పొలానికి వెళ్లగా, భూమి సుమారు 5 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల లోతుకు కుంగిపోయి ఉండటాన్ని గమనించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని భూమి కుంగిన ప్రాంతాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇది భూకంప ప్రభావమా? లేక పాత బోరు బావి లేదా భూగర్భంలో ఖాళీలు ఉండటమే కారణమా? అంటూ ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. భూమి అకస్మాత్తుగా కుంగిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు గల అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.