Mahaa Daily Exclusive

  దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు…

Share

  • దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు
  • విచారణకు రాకపోతే ఎన్ బీడబ్ల్యూ జారీ చేస్తామన్న న్యాయమూర్తి
  • దక్కన్ కిచెన్ కూల్చివేత కేసు ఫిబ్రవరి 5 కు వాయిదా

హైదరాబాద్, మహా : దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో సినీ కుటుంబం దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రాణాలకు నాంపల్లి కోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. కిచెన్ కూల్చివేత అక్రమమంటూ గతంలో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు దగ్గుబాటు కుటుంబసభ్యులు హాజరవాలంటూ నాంపల్లి కోర్టు పలు పర్యాయాలు నోటీసులు జరీ చేసింది. అయినప్పటికీ ఏవో కారణాలతో దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రాణాలు హాజరు కావడం లేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు కోర్టుకు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ను ధిక్కరిస్తారన్న న్యాయస్థానం సెలబ్రిటీలకు ఒక న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని వ్యాఖ్యానించింది. ీ సారి విచారణకు హాజరు కాకపోతే కోర్టు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన న్యాయమూర్తి విచారణను ఫిబ్రవరి 5 వ తేదీకి వాయిదా వేశారు.