Mahaa Daily Exclusive

  జీఏడీ అధికారి కొప్పుల జనార్ధన్ పదవీ విరమణ: సచివాలయంలో ఘనంగా వీడ్కోలు

Share

  • జీఏడీలో పని చేసిన గ్రేడ్ 2 అధికారి పదవీ విరమణ
  • ఘనంగా వీడ్కోలు పలికిన తోటి ఉద్యోగులు

హైదరాబాద్, మహా : రాష్ట్ర సచివాలయంలోని సాధారణ పరిపాలనా విభాగంలో దీర్ఘకాలం పాటు పని చేసి గ్రేడ్ 2 అధికారి హోదాలో ఉన్న కొప్పుల జనార్ధన్ శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి ఉద్యోగులు, సన్నిహితులు, మిత్రులు పజదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. జనార్ధన్ శేష జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ పలువురు ఆకాంక్షించారు. పదవీ విరణ సభలో ఏఎస్ కె వెంకటేశ్వర్ రావు, ఎస్ఓ పిల్ల శ్రీనివాస్, ఏఎస్ఓలు కె.వి. శ్రీనివాసరావు, జి.వి. నర సింహ రావు, ఎస్.ఏ. మహబూబ్ బాషా, కె. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.