- వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం
- ఆరు చరణాలు తప్పనిసరి పాదాలని ఉత్తరువులు
న్యూఢిల్లీ, మహా: జాతీయ గేయం ‘వందేమాతరం’ పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఎక్కడ పాడినా, వినిపించినా మొత్తం ఆరు చరణాలను కలిపి పాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుకొని అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాఠశాలల్లో వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడేవారు. అయితే ఇకపై ఆరు చరణాలు పాడుతూ, భవిష్యత్తు తరాలకు ఈ గేయంపై గౌరవం పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వందేమాతం పాడే ప్రతి చోటా ఆరు చరణాలు తప్పనిసరిగా వాడుకలో ఉండేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.వందేమాతరం పాడేటప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా నిల్చోవాలని, గేయాన్ని ఆలపించేటప్పుడు ఇతరులను ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇక నుంచి జాతీయ గీతం జనగణ మన కంటే ముందుగా వందేమాతరం ఆలపించాల్సి ఉంటుంది. వందేమాతరం ఆరు చరణాలను 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.








