Mahaa Daily Exclusive

  ఉమ్మడి ఖమ్మంలో దుమ్మురేపిన కాంగ్రెస్….

Share

  • ఉమ్మడి ఖమ్మంలో దుమ్మురేపిన కాంగ్రెస్
  • – మున్సిపాలిటీలన్నీ హస్తగతం
  • – కొత్తగూడెం కార్పోరేషన్ లో హంగ్

ఖమ్మం, మహా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్ చేసింది. మున్సిపాలిటీలన్నింటిలో స్పష్టమైన ఆధిక్యంతో సత్తాచాటింది. అశ్వారావుపేట, ఇల్లెందు, కల్లూరు, మధిర, సత్తుపల్లి, వైరా, ఎదులాపురం మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. అశ్వరావుపేటలో 22 వార్డులకుగానూ కాంగ్రెస్‌-17, బీఆర్​ఎస్​ -2, బీజేపీ ఒకటి, ఇతరులు రెండు వార్డుల్లో గెలిచారు.

మధిరలో 18 వార్డులు గెలిచిన హస్తం : ఇల్లెందులో 24 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 19, బీఆర్​ఎస్​-3, ఇతరులు-3 చొప్పున విజయం సాధించారు. కల్లూరులోని 20 వార్డులలో కాంగ్రెస్ 12 వార్డులను ఒడిసిపట్టింది. బీఆర్​ఎస్​ – 6, బీజేపీ – ఒక స్థానంలో, ఇతరులు ఒకటి గెలుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోనూ కాంగ్రెస్‌ పట్టు నిలుపుకుంది. 22 వార్డులలో కాంగ్రెస్‌ 18, బీఆర్​ఎస్ ఒకటి, ఇతరులు మూడు చొప్పున గెలుచుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర, ఏదులాపురం, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లోని 117 వార్డులకు గానూ 83 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం దక్కించుకుంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోని 46 వార్డులకు 36 వార్డుల్లో కాంగ్రెస్​ జెండా ఎగురవేసింది. అభ్యర్థుల గెలుపుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. గెలుపొందిన అభ్యర్థులతో విజయోత్సవ ర్యాలీలు చేపట్టారు.

కొత్తగూడెం కార్పొరేషన్​లో హంగ్ : మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎన్నికలు రసవత్తంగా జరిగాయి. 60 డివిజన్లకు సీపీఐ- 24, కాంగ్రెస్‌- 20, బీఆర్​ఎస్ – 9​, సీపీఎం- 1, బీజేపీ -1, స్వతంత్రులు ఐదుచోట్ల విజయం సాధించారు. దీంతో కొత్తగూడెం నగరపాలికలో హంగ్​ ఏర్పండింది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు 31 మంది కార్పొరేటర్లు కావల్సి ఉండగా సీపీఐకి మద్దతు ఇవ్వనున్నట్లు బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ ప్రకటించారు. దీంతో మేయర్​ పదవి సీపీఐ ఖాతాలో చేరనుంది.

మున్సిపాలిటీల్లో వార్డులతో పూర్తి వివరాలు…

ఏదులాపురం -32 వార్డులు

కాంగ్రెస్‌ – 24
బీఆర్‌ఎస్‌ -2
స్వతంత్రులు -6
………………

కల్లూరు – 20 వార్డులు

కాంగ్రెస్- 12
బీఆర్‌ఎస్‌ -6
బీజేపీ -1
ఇతరులు -1
……………………..
మధిర -22 వార్డులు

కాంగ్రెస్‌-18
బీఆర్‌ఎస్‌-1
ఇతరులు-3
……………….
సత్తుపల్లి -23 వార్డులు

కాంగ్రెస్ -17
బీఆర్‌ఎస్‌-6
…………………..
వైరా – 20 వార్డులు

కాంగ్రెస్‌ – 12
బీఆర్‌ఎస్‌-5
స్వతంత్రులు – 3
……………………….
అశ్వరావుపేట – 22 వార్డులు

కాంగ్రెస్‌-17
బీఆర్‌ఎస్‌-2
బీజేపీ-1
స్వతంత్రులు -2
…………………..
ఇల్లెందు – 24 వార్డులు

కాంగ్రెస్‌ -19
బీఆర్‌ఎస్‌ -3
ఇతరులు -3

Latest