Mahaa Daily Exclusive

  గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ ఎమ్మెల్యే దానం ధీమా

Share

 

హైదరాబాద్, మహా : మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనపై విశ్వాసం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించారని, ఇదే తరహాలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుచుకుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు, శనివారం ఉదయం తన నివాసంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందని ప్రచారం చేసిన వారందరి కళ్ళు తెరిపించేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల ప్రజల సానుకూలంగా ఉన్నారని తెలిపారు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తుందన్నారు, హైదరాబాదును విశ్వనగారంగా అభివృద్ధి చేస్తూనే రాజకీయాల కతీతంగా పేద ప్రజలు, కార్మికులు, మురికివాడల అభివృద్ధి చిన్న తరహా వ్యాపారుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు.

Latest