Mahaa Daily Exclusive

  అంగరంగవైభవంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనయుడి వివాహం..!

Share

  • అంగరంగవైభవంగా
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనయుడి వివాహం
  • హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు
  • – మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్, హేమంత్ సోరెన్, డికెశివకుమార్, చిరంజీవి సహా ప్రముఖుల హాజరు

 

హైదరాబాద్, మహా : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, సినీ రంగ దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం, టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ ముఖ్య నేతలున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు హజరయ్యారు. బీజేపీ నేతల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయలు హాజరయ్యారు. సినీ ప్రముఖుల్లో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, నటుడు తనికెళ్ల భరణి, ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ విజయమ్మలు హాజరయ్యారు. ఏపీకి చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

….

Latest