Mahaa Daily Exclusive

  పార్టీ జెండా మోసిన వారికే కాంగ్రెస్ లో గుర్తింపు: బానోతు రామ్మూర్తి

Share

పార్టీ జండా మోసిన వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది
*కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి
*డిప్యూటీ సీఎం భట్టిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రామ్మూర్తి
*ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీకి సేవ చేస్తా

కారేపల్లి, మహా:కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారిని గుర్తించి పార్టీ పదవులు ఇచ్చి గౌరవించిందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి అన్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఇటీవల పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ అధిష్టానం తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పార్టీలో ఆది నుంచి అండగా ఉంటూ నా ఎదుగుదలకు కృషి చేసిన డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గుర్తిస్తుందని ఇటీవల ప్రకటించిన జిల్లా కమిటీ ని బట్టి స్పష్టమైందని అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ జెండాను మోసిన నాయకులు కార్యకర్తలు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రాధాన్యత లభిస్తుంధని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి సమర్థవంతమైన నాయకత్వంతో పాటు సైనికుల్లా పనిచేసే పార్టీ కార్యకర్తలు ఉన్నారని, ప్రతి ఎన్నికలో పార్టీ విజయానికి దోదపడుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం లో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదలందరికీ అందేవిధంగా కృషి చేయాల్సిన బాధ్యత కూడా నాయకులు కార్యకర్తల పై ఉందని అన్నారు.

Latest