Mahaa Daily Exclusive

  ఘనంగా భారతీయ జనతా పార్టీ 46 ఆవిర్భావ దినోత్సవం..

Share

సదాశివపేట: మహా :
సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మండల పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కరణం ఆదిత్య గ మాట్లాడుతూ ఎందరో కార్యకర్తల బలిదానాల పునాదులపై నిర్మితమై క్రమశిక్షణ అంకితభావానికి ప్రతిరూపమై దేశాభివృద్ధి యజ్ఞంలో నిమగ్నమై ప్రపంచలో అతి పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు నామ హరీష్, ఉక్కిస భరత్, జిల్లా నాయకులు సారా కృష్ణ, అంబదాస్, జగన్నాథ్ రెడ్డి , మండల నాయకులు శ్రీకాంత్, సుభాన్, లక్ష్మణ్ , అంబదాస్, ప్రసాద్, నాగరాజు, ప్రశాంత్, దుర్గరాజ్, అనిల్, మల్లేశం, నితీష్, సాకేత్, మల్లేష్, గోపాల్ శివ, శ్రీకాంత్, మాణిక్యం బూత్ అధ్యక్షులు సురేష్, సత్యనారాయణ మరియు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.