Mahaa Daily Exclusive

  ఆందోల్ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. యం. రాజీవ్..

Share

 

ఆందోల్ నియోజకవర్గ సమన్వయకర్తగా టీపీసీసీ డాక్టర్ సెల్ , మెడికల్ & హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డా. యం. రాజీవ్ , ఆందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా డా. రాజీవ్ మాట్లాడుతూ,
“నా మార్గదర్శకుడు అయిన గౌరవ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారి ప్రాతినిధ్య నియోజకవర్గంలో వారితో కలిసి పనిచేసే అవకాశం లభించడం నాకు గొప్ప అవకాశం గా భావిస్తున్నాను. వారి అనుభవం, మార్గదర్శకత్వం ద్వారా ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు . పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తాను” అని తెలిపారు.
అలాగే, ఆందోల్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి , పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.