- ‘కేకే కమిటీ’ అనేది పచ్చి అబద్ధం
- ఉద్యమకారుల గుర్తింపుపై ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదు
- తప్పుడు ప్రచారాలను నమ్మద్దు
- టియు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపోల్ రామ్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 23 మహా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ‘కేకే కమిటీ’ని నియమించిందంటూ సోషల్ మీడియా, కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ స్పష్టం చేసింది. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపూలు రామ్ రెడ్డి మాట్లాడారు. అధికారిక జీవో లేకుండా కమిటీ ఎలా ఏర్పాటవుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యమకారుల గుర్తింపు కోసం ఎలాంటి అధికారిక కమిటీని ప్రకటించలేదని రామ్ రెడ్డి వివరించారు. ఒకవేళ ప్రభుత్వం కమిటీని వేయదలచుకుంటే ముందుగా అధికారికంగా జీవో విడుదల చేయాల్సి ఉంటుందని, అలాంటిదేమీ లేకుండా వస్తున్న ఊహాగానాలను ఉద్యమకారులు నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు. గందరగోళం సృష్టిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు జేఏసీ పోరాటం ఆపదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను నెరవేర్చాలన్నారు.








