*అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు*
*అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ*
*వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద*
మహా వరంగల్ బ్యూరో;
వరంగల్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గురువారం నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని 252 జీవో ననుసరించి అర్హులైన జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ లు అందజేస్తామని జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ సత్యశారద తెలిపారు.
వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో జరిగింది.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్రిడిటేషన్ కోసం ఆన్లైన్ ద్వారా ఐపిఆర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను జీవో ననుసరించి క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పంపిణీ చేసేందుకు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ప్రయత్నించాలని ఆమె సూచించారు.
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని, నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2026-2028 సంవత్సరానికి నూతన కార్డులు జారీచేసే పక్రియ ను వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు.
అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియని ఆమె పేర్కొన్నారు .ఎవరు కూడా ఆందోళనకు గురి కాకుండా జర్నలిస్టులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని జర్నలిస్టులకు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో
డిపిఆర్ఓ ప్రేమలత, వరంగల్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శ్రీరాo రాoచందర్, మెండు రవీందర్, దొంతు నవీన్, బోడిగ శ్రీనివాస్, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల సోమేశ్వర్, హుస్సేన్ పాషా, బొల్లపల్లి రాజు పాల్గొన్నారు.








