*పిల్లలు మొబైల్ ఫోన్ కు బానిస కావద్దు*
*పిల్లలకు నాణ్యమైన చదువు, పౌష్టికాహారాన్ని అందించాలి*
*ఆస్తి కన్నా జ్ఞానం మిన్న*
*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*
మహా వరంగల్ బ్యూరో;
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెల్ఫేర్ విభాగంలో గురువా అశోక్ నగర్ లో జరుగుతున్న తల్లిదండ్రుల -ఉపాధ్యాయ సమావేశానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
సంక్షేమ వారోత్సవాలలో భాగంగా గురువారం ఖానాపూర్ మండల అశోక్ నగర్ పిల్లల తల్లిదారులు, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పిల్లలకు నాణ్యమైన చదువు తో పాటు పౌష్టిక ఆహారాన్ని అందించే దిశగా కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా పిల్లల సమస్యలు పరిష్కరించే దిశగా కమిటీలను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల లో హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయడం జరిగిందని, అలాగే వచ్చే విద్య సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రతి పాఠశాలకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేసి వారు ప్రతి వారం పాఠశాలను సందర్శించి విద్యాపరమైన విషయాలను, భోజన సదుపాయాలను, మౌలికపరమైన అంశాలను క్రోడీకరించి, వాటి పై చర్చించి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు.
విద్యార్థులు పెద్దలను గౌరవించాలని, మొబైల్స్ కు బానిసగా కాకూడదని, చిన్న చిన్న విషయాలకు కృంగిపోకూడదు అని ప్రతి పాఠశాలలో స్ఫూర్తి ప్రోగ్రాం ద్వారా మోటివేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులు విద్యార్థులకు ఆస్తిపాస్తుల కంటే జ్ఞానాన్ని అందించాలని తద్వారా వారు వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా కుటుంబానికి, దేశానికి ఉపయోగపడతారని తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో తెలుగు పద్యాలు చదివించి వాటి భావాలను తెలపాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పలు సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించారు. ప్రతి క్లాసులో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మానం చేశారు.
ఈ సమావేశంలో డి బి సి డబ్ల్యూ వో పుష్పలత , అడిషనల్ డి ఆర్ డి ఓ రేణుక , పాఠశాల ప్రిన్సిపాల్ సురేందర్, డైరెక్టర్ దామోదర్ రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ అనూష, సాయిల తో పాటు ఉపాధ్యాయ ఉపాధ్యాయేత సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.








