*హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత*
*బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు*
*ఘనంగా హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం*
మహా వరంగల్ బ్యూరో;
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని హనుమాన్ దేవాలయం ఓ సిటి ప్రాంతంలో నిర్వహించిన హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ ధర్మం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో హిందువుల ఐక్యత, సాంప్రదాయ విలువలు కాపాడుకోవడానికి ఇలాంటి ధర్మ సమ్మేళనాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. యువత హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు, బస్తి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 10








