- మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- కాంగ్రెస్ జిల్లా లీడర్లు పగడాల మంజుల, బానోతు రామ్మూర్తి
కారేపల్లి, మహా: రైతుల సంక్షేమం కోరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి సూచించారు. కారేపల్లి మండలంలోని మాదారం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి రైతులతో మాట్లాడాడు. రైతులు ఎ లాంటి ఇబ్బందులు పడకూడదని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కొనుగోలు కేంద్రాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. సొసైటీ కొనుగోలు చేసిన మొక్క జొన్న నిల్వల పై గిడ్డంగుల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న అప్పాయిగూడెం గోదాములను సిద్ధం చేయించారని, రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఈ గోదాములను తిరిగి పునః ప్రారంభించే విధంగా ఎమ్మెల్యే జరిపిన కృషి అభినందనీయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేసే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. అకాల వర్షాల వల్ల మొక్కజొన్న రైతులు ఇబ్బంది పడకూడదని వైరా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులతో ప్రత్యేక కమిటీలను వేసి కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాములకు తరలించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. రైతులు పండించిన పంటలను దళారులకు అప్పగించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. వేసవి ఎండ తీవ్రత ను కూడా రైతులు గమనంలోకి తీసుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.







