- ఇందిరమ్మ ఇళ్లు పేదల పాలిట వరం
- ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న సర్పంచ్ కల్తీ భద్రం,కార్యదర్శి గుగులోత్ లోకేశ్వరి
కారేపల్లి,మహా:
సింగరేణి మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలగూడెం గ్రామంలో లబ్ధిదారురాలు, రేసు సుజాత ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి సర్పంచ్ కల్తీ భద్రం, మాజీ సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ భద్రం,డేగల ఉపేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతున్నదని, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హయాంలోనే వందల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేశారు.కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలో 10 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు.ప్రభుత్వం అందజేసిన 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని అందరికంటే ముందుగానే గృహప్రవేశం చేయడం విశేషం.కాగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో అనేక మంది పేదవాళ్లకు సొంతింటి కల నెరవేరిందని అన్నారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, విడతలవారీగా మంజూరైన ప్రభుత్వ సహాయంతో సొంత ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడం పలువురికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్ లోకేశ్వరి, ఉపసర్పంచ్ పూనెం రమ, బేతంపూడి సర్పంచ్ ఊకే సునీత సూర్యనారాయణ,వార్డు సభ్యులు ముక్తి శ్రీను,పూనెం వెంకటేశ్వర్లు,పెనక నగేష్,కడారి వెంకట్,కల్తీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు







