ఇన్చార్జి ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్
కారేపల్లి, మహా; కారేపల్లి మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులతో వేగవంతం చేయించాలని ఇన్చార్జి ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ సూచించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మండల వ్యాప్తంగా మొదటి విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులలో మరింత వేగంతో పెంచేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. వచ్చే జూన్ 2 నుంచి మరో విడత ఇంద్రమ్మ ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉండటం వల్ల, ప్రస్తుతం మంజూరై ఇళ్ల నిర్మాణం పనులను మరింత వేగవంతంగా జరిగేలా చూడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో కోటేశ్వరరావు, హౌసింగ్ ఏఈలు నాగేంద్ర, స్వప్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 96







