కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని
విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన గంగాధరణి రవీంద్ర చారి(38)వెన్నెముక సమస్యతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు.దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.రవీంద్ర చారి నిత్యం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.పేద కుటుంబానికి చెందిన రవీంద్ర చారి అకాల మృతితో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది.ఆటో నడుపుకొని జీవించే పేద కుటుంబానికి చెందిన రవి మృతి వల్ల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్ నేతలు కోరారు. రవీంద్ర చారి మృతి విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేతలు వెంగళం నాగ బ్రహ్మచారి,తుమ్మోజు రామమూర్తి,ఆటో యూనియన్ నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.మృతుడు రవీంద్రచారికి భార్య సౌజన్య,కుమారుడు సాత్విక్ ఉన్నారు.







