Mahaa Daily Exclusive

  ఇంధన ధరల పెంపుపై మాస్ లైన్ నిరసన…

Share

 

కారేపల్లి, మహా : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం కారేపల్లి మండలం పోలంపల్లిలో కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాస్ లైన్ ఖమ్మం డివిజన్ నాయకులు గుగులోతు తేజ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం పెట్రోలియం ధరలు పెంచటం దేశ ప్రజలను మోసం చేయటమేనన్నారు. ఇంధన ధరల పెంచటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర ఆర్థిక భారం పడుతుందని నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బస్ ఛార్జీలు, ఆటో సేవల ధరలు పెరగనున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ఇంధన ధరల తగ్గించాలని లేదంటే ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ నాయకులు పులకాని సత్తిరెడ్డి, రావుల నాగేశ్వరావు, ధరావత్ సక్రు నాయక్, గుగులోతు రాము, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.