Mahaa Daily Exclusive

  సిఎం ని కలిసిన 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు…

Share

హైదరాబాద్, మహా.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని 2025 బ్యాచ్‌కి చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ప్రాంగణంలోని బోధి పెవిలియన్‌లో ఈ ప్రత్యేక సమావేశం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా యువ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడి వారికి పరిపాలనా పరమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వైస్‌ చైర్‌పర్సన్ శాంతి కుమారి , కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషా రాణి పాల్గొని శిక్షణ పొందుతున్న అధికారులకు సంబంధించిన పలు కీలక విషయాలను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తమ శిక్షణా అనుభవాలను పంచుకున్న ట్రైనీ ఐఏఎస్‌ల బృందంలో ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. నూతన బాధ్యతలు చేపట్టబోతున్న యువ అధికారులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.