- త్యాగానికి ప్రతిరూపం, క్రమశిక్షణకు నిదర్శనం బక్రీద్
- సంతోషం, శాంతి, సామరస్యాల కలయికే ఈ పండుగ
- అల్లాహ్ కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండాలి
- ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శుభాకాంక్షలు
ఇబ్రహీంపట్నం మహా:
త్యాగానికి, నిస్వార్థానికి, దైవ భక్తికి ప్రతీక బక్రీద్ అని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ముస్లిం సోదరుల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా నియోజకవర్గ ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మానవ సమాజానికి ప్రేమ, కరుణ, శాంతిని చాటిచెప్పేది ఈ పవిత్ర దినమని… ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ అభివర్ణించినట్టుగా గంగా-జమున తెహజీబ్ సంస్కృతికి ఈ ప్రాంతం నిలయమన్న మల్ రెడ్డి…. సోదరభావంతో, సామరస్యంతో పండుగలు జరుపుకోవడం గొప్పతనంగా పేర్కొన్నారు. ముస్లిం సోదరులంతా పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న ఆయన…. షాదీ ముబారక్, హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, షాదీఖానాలు, మసీదుల అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధికి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.








