- గుడి నిర్మాణానికి అండగా నిలిచిన గుడిపూడి తిరుమలరావు
- కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు నాగులు నాయక్, కమిటీ సభ్యులు
కారేపల్లి,మహా:
సింగరేణి మండల పరిధిలోని తులిస్యతండా గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం, గేటు కారేపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై గుడిపూడి తిరుమలరావు 10 వేల రూపాయలు వితరణగా అందజేశారు.గుడి నిర్మాణం కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సపావట్ నాగులు నేతృత్వంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గురువారం గుడిపూడి తిరుమలరావు ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసారు.గుడి నిర్మాణానికి సహకరించాలని కోరారు.స్పందించిన గుడిపూడి తిరుమలరావు తక్షణ సాయం కింద 10 వేల రూపాయలను అందజేశారు.భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు నాగులు తెలిపారు.ఈ సందర్భంగా నాగులు,కమిటి సభ్యులు గుడిపూడి తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు
Post Views: 129








