Mahaa Daily Exclusive

  మొక్కజొన్న కొనుగోలుతో రైతు కు మద్దతు ధర..

Share

  • మొక్కజొన్న కొనుగోలుతో రైతు కు మద్దతు ధర
  • రుణాల వసూళ్లకు న్యాయపరమైన చర్యలు- సోసైటీ చైర్మన్ దుగ్గినేని

కారేపల్లి, మహా : కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పట్టుదలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు మద్దతు ధర కల్పించటం జరిగిందని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం కారేపల్లి సోసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోసైటీ ద్వారా మాధారంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా 803 రైతులకు సంబంధించి రూ.11.94 కోట్ల విలువైన 49758.50 క్వింటాళ్ళ మొక్కజొన్నను కొనుగోలు చేయటం జరిగిందన్నారు. దీని ద్వారా రైతులకు రూ.2.99 కోట్లు లాభం చేకూరిందన్నారు. మొక్కజొన్న కొనుగోలు సంబంధించి ప్రభుత్వం పైకం విడుదల చేసిందని, రైతు ఖాతాలో మÖడు రోజులలో రైతు ఖాతాలలో జమ కానున్నాయని తెలిపారు. సోసైటీ రుణ వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ చేసినట్లు తెలిపారు. రైతులు తప్పని సరిగా వడ్డీలు చెల్లించి రుణాలు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. రుణాల రెన్యూవల్ చేసుకోవటం ద్వారా రుణమాఫీ, పావలా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. బకాయిల వసూళ్లకు ఇప్పటికే న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే బకాయిదారులకు నోటీసులు ఇవ్వటం జరిగిందన్నారు. రికవరీ సెక్షన్ ద్వారా రుణ వసూళ్లకు జప్తులు, తనఖా పెట్టిన భూములపై జెండాలు పెట్టి స్వాదీనంకు చర్యలు జరుగుతున్నాయన్నారు. రైతు సోదరులు సోసైటీని వినియోగించుకోవటం ద్వారా అర్ధిక అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి బొల్లు హనుమంతరావు, డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోషయ్య, కొత్తూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.