Mahaa Daily Exclusive

  మమతా బెనర్జీకి మరో భారీ షాక్..

Share

  • మమతా బెనర్జీకి మరో భారీ షాక్
  • అధికార ప్రతినిధి శంతను సేన్ రాజీనామా
  • కకోలి దస్తీదార్ రాజీనామా చేసిన మరుసటి రోజే షాకిచ్చిన శంతను

కోల్ కత్తా, మహా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన అనంతరం మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. నిన్న కకోలీ దస్తీదార్ ఘోష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా మరుసటి రోజే శంతను సేన్ షాకిచ్చారు. 2024 నాటి ఆర్జీకర్ హత్యాచార కేసు, పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నానని శంతను సేన్ పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా తన పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని తెలిపారు. వివిధ సమయాల్లో తాను పార్టీ నిర్ణయాలతో ఏకీభవించలేదని, అనేక వివాదాస్పద అంశాలపై తాను బహిరంగంగానే ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రజలు తనను వివిధ సందర్భాలలో ఎంతగానో ప్రశంసించారని పేర్కొన్నారు. ఆర్జీకర్ కేసు, నిరుద్యోగం, అవినీతి సహా వివిధ అంశాల కారణంగా ప్రజలు తమను ఓడించారని, అందుకే అధికార ప్రతినిధిగా మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.