కారేపల్లి, మహా : టీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి నాయకుడు, కార్యకర్త భాగస్వాములు కావాలని వైరా దివగంత మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ తనయ బానోత్ మనిషాలక్ష్మి కోరారు. సోమవారం కారేపల్లి మండలంలో పర్యటించారు. భాగ్యనగర్‌తండా లో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే ఫెర్టిలైజర్ షాపును ఆమె ప్రారంభిచారు. కారేపల్లి లో ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ ఉద్యమకారుడు సోమందుల నాగరాజును పరామర్శించి ఆరోగ్యం పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. జిల్లా మైనారిటీ నాయకులు షేక్ గౌసుద్దీన్ ఇంట్లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీఆరఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వాంకుడోత్ జగన్ నాయక్, బీఆరఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, నాయకులు డొంకెన రవీందర్, ఇస్లావచ్ సుజాత, జర్పుల హచ్చు, బానోత్ మోహన్, జడల కళ్యాణ్, ధారావత్ వికాస్, బానోత్ రాజేష్, మణికొండ నాగేశ్వరరావు, తెలగొర్ల రామారావు, గంగరబోయిన మురళి, పేర్ని వెంకటేశ్వర్లు, పొడుగు హరీష్, రమేష్, మూతి కోటేశ్వరరావు, అజ్మీర రవి, వెంకట్, ఖలీలుల్లాఖాన్, సురేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.








