Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలం-కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు..

Share

  • కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలం-కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు
  • గేట్ కారేపల్లిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం ఎల్లయ్య,వరికోర్ల వీరభద్రం,గ్రామ కార్యదర్శి కొత్తపల్లి అనూష ,,వైస్ సర్పంచ్ కందుల శ్రీనివాసరావు, వార్డ్ సభ్యులు,అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,గ్రామ పెద్దలు చెరుకూరి వెంకటయ్య గారు,గుడిపూడి నర్సయ్య, చెరుకూరి రామారావు,చెరుకూరి కృష్ణమూర్తి,సాయిన్ని తిరుపతయ్య,జక్కుల రంజిత్, భూక్యా నరేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.