Mahaa Daily Exclusive

  కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం….

Share

  • కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం
  • సీఎం డీకేకు షాక్ ఇస్తున్న మంత్రులు
  • ఉదయం ఒక మంత్రి రాజీనామా
  • అదే దారిలో మరో మంత్రి సిద్దం

బెంగళూరు, మహా : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే సీఎం డీకే శివకుమార్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. శుక్రవారం ఉదయం రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసేపటికే మునియప్ప అసంతృప్తి గళమెత్తారు. గతంలో, తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల మంత్రిత్వశాఖ కేటాయించారని రెడ్డి ఆరోపించారు. మాట తప్పినందునే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. మరి కొంతమంది సీనియర్లు కూడా ఇదే బాటలో ఉన్నారని తెలుస్తోంది. శాఖల కేటాయింపు విషయంలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. సీనియర్ నాయకుడు కేహెచ్ మునియప్ప తన ప్రస్తుత శాఖలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు, మంత్రి రామలింగారెడ్డి కూడా శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కె.హెచ్. మునియప్ప మాట్లాడుతూ, తనకు పోర్ట్‌ఫోలియో మార్పు కావాలని పార్టీ నాయకత్వం ముందు డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటక పర్యటన సందర్భంగా కూడా తాను ఈ అభ్యర్థన చేసినట్లు ఆయన చెప్పారు. తాను ఈ విషయాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా చర్చిస్తానని మునియప్ప అన్నారు . సీనియర్ నాయకులకు ప్రోటోకాల్, అనుభవం ఆధారంగా పోర్ట్‌ఫోలియోలను కేటాయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు సాంఘిక సంక్షేమం, వ్యవసాయం లేదా నీటిపారుదల శాఖలను కేటాయిస్తే ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయగలనని పేర్కొంటూ, మునియప్ప ఈ శాఖల పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేశారు. తాను గత మూడేళ్లుగా ఆహార, పౌర సరఫరాల శాఖను నిర్వహించానని, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

శాఖల కేటాయింపు విషయంలో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం తెలిపారు. ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని తన ఆప్తమిత్రుడిగా ఆయన అభివర్ణించారు. రామలింగారెడ్డి అభ్యంతరం తనకు కేటాయించిన శాఖ సంబంధించిందని, దీన్ని పరిష్కరిస్తామని శివకుమార్ అన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “రామలింగారెడ్డి నా సహచరుడు, ఒక సీనియర్ నాయకుడు. ఆయనకు కేటాయించిన శాఖలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, ఆయనకు వేరే శాఖ కావాలని చెప్పారు. నేను ఈ విషయం ఆయనతో చర్చించి ఒక పరిష్కారం కనుగొంటాను. ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు” అని సీఎం డీకే చెప్పారు.