Mahaa Daily Exclusive

  అభం శుభం తెలియని బాలికకు నరకo చూపించారు…

Share

అభం శుభం తెలియని బాలికకు నరకo చూపించారు.
• కేవలం హిందూ పిల్లలే టార్గెట్..!!
• ఎంఐఎం, ముస్లింల లవ్ జిహాద్, అఘాయిత్యాలపై ఎందుకీ చోద్యం?
• కాంగ్రెస్ పుణ్యమా అని తెలంగాణలో 15 శాతం పోక్సో కేసులు..!
• నిందితుడు తమ పార్టీ వాడు కాబట్టే బీఆర్ఎస్ నాయకుల నోళ్లు మూగబోయాయా?
• ముస్లింల ఓట్లు, ఎంఐఎం సీట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చేస్తోంది!
• ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి కామాంధుడిని వెంటనే శిక్షించాలి.
• బాధితురాలికి తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలి.
• ఖమ్మం బాలిక ఘటనపై బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి తీవ్ర ఆగ్రహం.

హైదరాబాద్, మహా.

ఖమ్మం నగరంలో అభం శుభం తెలియని పసి మొగ్గపై కామాంధుడు చూపించిన నరకం, హత్యాయత్నం ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. ఈ అమానుష అఘాయిత్యానికి గురై హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చావుబతుకుల మధ్య పోరాడుతున్న ఆ బాధిత మైనర్ బాలికను భారతీయ జనతా పార్టీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం పరామర్శించింది. ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు ఉన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం డాక్టర్ శిల్పారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, హిందూ బాలికలపై జరుగుతున్న దాడులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ద్వంద్వ నీతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆ చిన్నారి నరకం వర్ణనాతీతం.. చూస్తుంటేనే భయమేస్తోంది
ఈ ఘోర ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న డాక్టర్ శిల్పారెడ్డి, తాను ఒక వైద్యురాలిగా ఆసుపత్రి లోపలికి వెళ్లి ఆ చిన్నారిని స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. ఆ బాలిక ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక ఆందోళన (ట్రామా) వర్ణనాతీతమని, దగ్గరకు వెళ్లి ముట్టుకుంటేనే భయంతో వణికిపోతోందని, ఆమె అనుభవిస్తున్న నరకాన్ని కళ్లారా చూశానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అఘాయిత్యం చేసిన అనంతరం సాక్ష్యాలు లేకుండా చేయడానికి ఆ కామాంధుడు చిన్నారిని బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేయడం అత్యంత దారుణమన్నారు. పైనుంచి పడటం వల్ల ఆ పసిబిడ్డకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ (అనేక ఎముకలు విరగడం) అయ్యాయని, స్పైనల్ ఇంజురీ (వెన్నెముక దెబ్బతినడం) కారణంగా కనీసం లేవలేని దీనస్థితిలో మంచంపై పడివుందని కన్నీటిపర్యంతమయ్యారు. కూలీ పనులు చేసుకునే ఆ బాలిక తల్లి ఆసుపత్రి వద్ద పడుతున్న వేదన గుండెలను పిండేస్తోందని చెబుతూ.. అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తోంది, ఆడపిల్లల భవిష్యత్తు ఏంటో చూస్తుంటేనే భయమేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
హిందూ పిల్లలే టార్గెట్.. ఎంఐఎం, ముస్లింల దాడులపై ఎందుకీ మౌనం?
సమాజంలోని కొన్ని వర్గాల తీరును డాక్టర్ శిల్పారెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. ఎంఐఎం పార్టీకి చెందిన వారు, ముస్లింలు ఉద్దేశపూర్వకంగా హిందూ మహిళలను, అభం శుభం తెలియని చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. లవ్ జిహాద్ పేరుతో, చిన్నారులను సైతం వదలకుండా ఇలాంటి అమానవీయ, దుర్మార్గపు లైంగిక దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నిందితుడు గౌస్‌కు ఇప్పటికే రౌడీషీటర్ అనే పేరుందని, గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అంతటి నేర చరిత్ర ఉన్న క్రిమినల్‌పై ముందే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వం ఇలా చోద్యం చూడటం దారుణమని ధ్వజమెత్తారు.
తెలంగాణలో రోజుకు 5 పోక్సో కేసులు.. ఇదీ కాంగ్రెస్ పాలన
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గణాంకాలతో సహా శిల్పారెడ్డి విమర్శించారు. దేశంలో మొత్తం 9 శాతం పోక్సో కేసులు నమోదైతే, కేవలం కాంగ్రెస్ పాలనలోని తెలంగాణలోనే 15 శాతం కేసులు నమోదవుతుండటం ఇక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. తెలంగాణలో సగటున రోజుకు 5 పోక్సో కేసులు రికార్డవుతున్నాయని, 2025 నుంచి ఇప్పటివరకు ఏకంగా 563 పోక్సో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ముస్లింల ఓట్లు, ఎంఐఎం సీట్ల కోసం ఆశపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నిందితుడు ముస్లిం కాబట్టే అతనిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న మంత్రి సీతక్క కేవలం పరామర్శించి వెళ్లారే తప్ప, ఈ ఘటనపై రివ్యూ చేయలేదని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదని మండిపడ్డారు.
నిందితుడు తమ పార్టీ వాడనే బీఆర్ఎస్ నోరు మూసుకుందా?
నిందితుడు గౌస్ వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక అండదండలపై డాక్టర్ శిల్పారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అతడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయని, అందుకే ఈ కేసు నుంచి అతడిని బయటపడేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. మొన్నటిదాకా రాష్ట్రంలో మహిళలపై దాడుల గురించి దొంగ ధర్నాలు చేస్తూ, టీవీ డిబేట్లలో గొంతుచించుకున్న బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారని నిలదీశారు. నిందితుడు తమ పార్టీకి చెందిన వాడు కాబట్టే వారి నోళ్లు మూగబోయాయా? బీఆర్ఎస్ కేవలం తమ పొలిటికల్ ఎజెండా కోసమే పనిచేస్తుందా? నిందితులు తమ వాళ్లయితే మిన్నకుండిపోతుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి.. తక్షణ ఆర్థిక సాయం అందించాలి
ఇలాంటి హేయమైన ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ పక్షాన డాక్టర్ శిల్పారెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, ఆ కామాంధుడికి వేగవంతంగా కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. అదేవిధంగా, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కడు పేదరికంలో ఉన్న బాధిత బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.