Mahaa Daily Exclusive

  అవినీతి పై ఏసీబీ సమర శంఖారావం….

Share

*అవినీతి పై ఏసీబీ సమర శంఖారావం*

*లంచాలు ఆర్జించే అధికారుల పై అవినీతి నిరోధక శాఖ కొరడా*

*ప్రభుత్వ స్వేచ్ఛ తో దూకుడు పెంచిన ఏసీబీ*

*గడిచిన సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు*

*ముందు వరుసలో పోలీసు, రెవెన్యూ శాఖలు*

*అభివృద్ధి పనుల పేరుతో అవినీతికి పాల్పడుతున్న అధికారులు*

మహా వరంగల్ బ్యూరో;

ప్రస్తుతం కొందరు అధికారులు చాప కింద నీరులా అవినీతికి పాల్పడుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా లంచాలు తీసుకుంటూ అక్రమంగా ఆస్తులను పోగేసు కుంటున్నారు.
ఇలాంటివి అధికమవుతుండటంతో అవినీతి నిరోధకశాఖ వీటి పై దృష్టి సారించింది.
గడచిన 13 రోజుల్లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మూడు నమోదు చేసి అవినీతి అధికారుల చిట్టా ఏసీబీ బయటపెట్టింది.
అక్రమార్కుల పై ఏసీబీ కొరడా ఝళిపిస్తుండటంతో అంతా అప్రమత్తమవుతున్నారు.

*నిదర్శనంగా పలు సంఘటనలు*

అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 13 రోజుల్లో ఏసీబీ రూ.36.9 కోట్ల అక్రమార్జనను గుర్తించింది.
లంచాలు తీసుకొని దొరికిన వారిలో, ఎవరి ఆస్తిని లెక్కించినా మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైనే ఉంటుందని తేలింది
* కాళేశ్వరం మాజీ ఈఎన్సీలు మురళీధర్‌ రావు, భూక్యా హరిరామ్, ఇరిగేషన్‌ ఈఈ నూనె శ్రీధర్‌ నుంచి ఇటీవల అనిశాకు చిక్కిన, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు జనరల్‌ మేనేజర్‌ అనంత లక్ష్మీ కుమార్, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మర్రి వంశీ మోహన్, ఈ నెలలో దొరికిన భుజంగ రావు, మోహన్‌ నాయక్, నరహరి రావుల ఉదంతాలే ఇందుకు నిదర్శనం

*లంచాల్లో మొదటి స్థానంలో పోలీసులు*

లంచాలు తీసుకొని ఏసీబీకి చిక్కుతున్న వారిని గమనిస్తే అధికంగా ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న అధికారులే అధికంగా ఉన్నారని తెలుస్తోంది.
వీరంతా ప్రజలను లంచాలు ఇవ్వాలని పీడిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సంవత్సరం ఏసీబీ చేసిన రైడ్లలో పోలీసు అధికారులే ఎక్కువగా ఉన్నారు. బాధితులు
అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరకు వెళ్తే, అమాయకుల దగ్గర నుంచే అధిక మొత్తంలో డబ్బులు లాగుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది జూన్ 16 వరకు ఏకంగా 14 కేసులు పోలీసుల పైనే నమోదు అయ్యాయి.

*తర్వాత స్థానంలో రెవెన్యూ శాఖ*

పోలీస్ శాఖ తర్వాత అధికంగా లంచాలకు పాల్పడుతున్నది రెవెన్యూ శాఖ అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ప్రతి కుటుంబానికి నిత్య జీవితంలో రెవెన్యూ శాఖతో సంబంధం ఉంటుంది దీనివల్ల ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత లంచాలు తీసుకొనేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇక నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పంచాయతీ వ్యవహారాలను చూసేందుకు చాలా వరకు ప్రజలను లంచం అడుగుతున్నారు.
ఈ విధంగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దొరికిన కాడికి దోచుకుంటున్నారు ఇదంతా అవినీతికి పరాకాష్ఠగా మారింది.

*అభివృద్ధి పనుల్లో అవినీతి వరద*

అక్రమార్జనలో అధికంగా లాగుతుంది మాత్రం అభివృద్ధి పనులు చేయిస్తున్న అధికారులనే తెలుస్తోంది ఎందుకంటే ప్రభుత్వాలు రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నాయి.
ఈ బాధ్యతలు తీసుకున్న అధికారులు అక్రమంగా లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా
అధికారిక లెక్కల ప్రకారం నీటిపారుదల శాఖ చేసిన విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌ రావు వద్ద రూ.9.42 కోట్లు గుర్తించగా, ఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్‌ వద్ద రూ.7 కోట్లు, కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన భూక్యా హరిరామ్‌ వద్ద రూ.5.26 కోట్ల ఆక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

*రవాణాశాఖ లోనూ అధికంగా అక్రమార్జన*

రోడ్లు, భవనాల అభివృద్ధి అంటూ అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు వీటికి సంబంధించిన ఉదంతాలు ఇటీవలి కాలంలో ఎన్నో బయటపడ్డాయి
మహబూబ్ నగర్ రవాణాశాఖ ఉప కమిషనర్ కిషన్ రూ. 12.72 కోట్లు కూడబెట్టినట్లు బయటపడింది.
ఈ నెలలో అదనపు ఎస్పీ (సస్పెన్షన్‌) భుజంగరావు రూ.5.92 కోట్లు, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ మోహన్‌ నాయక్‌ రూ.17.94 కోట్ల అక్రమార్జన వెలుగులోకి వచ్చింది. తాజాగా మంగళవారం చిక్కిన ల్యాండ్‌ అండ్‌ సర్వే డిపార్ట్‌మెంట్‌ డీడీ సుంకరి నరహరి రావు అక్రమార్జన రూ.13.05 కోట్లుగా తేల్చారు. ఈ ముగ్గురి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో కనీసం రూ.500 కోట్లు ఉంటుంది.

*అవినీతి పై దూకుడు పెంచిన ఏసీబీ*

ఇలాంటి ఘటనలు అధికమవుతుండటంతో ప్రభుత్వం ఏసీబీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది దీంతో ఏసీబీ దూకుడు పెంచింది.
ఈ క్రమంలో అక్రమార్కుల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది
2020 లో ఈ కేసులు కేవలం 94 నమోదయ్యాయి గత ఏడాది ఈ సంఖ్య 199కి చేరింది అంటే ప్రతి రెండు రోజులకు ఒక కేసు చొప్పున వెలుగులోకి వస్తున్నాయి.
అయినప్పటికీ కొంతమంది అధికారులు భయం లేకుండా యూపీఐ ద్వారా లంచాలకు పాల్పడుతున్నారు
వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినప్పుడు అక్కడున్న ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌ లకు ఏజెంట్లు ఏడాది కాలంలో రూ. 42,03,125 చెల్లించినట్లు గుర్తించారు.
2025, 2026లో గుర్తించిన మొత్తం ఆస్తులు
జూన్ 16 వరకు శాఖల వారిగా పోలీసు డిపార్ట్ మెంట్ లో 14 కేసులు, రెవెన్యూలో 13, మున్సిపల్ శాఖలో 8, పంచాయతీరాజ్ లో 8, విద్యాశాఖలో 6 కేసులు నమోదయ్యాయి
2026 లో ఇలా రూ.36,92,84,217 విలువైన ఆస్తులు ఏసీబీ గుర్తించింది అధికారిక విలువ ఇంతకు పదిరెట్లకు పైమాటే….
2025 లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ రూ.96,13,50,554 విలువైన ఆస్తుల్ని గుర్తించింది అనధికారికంగా వీటి విలువ కనీసం రూ.వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా.