Mahaa Daily Exclusive

  రోలు కల్చరే ముద్దు.. రోలే కావాలి.. గ్రైండర్ల కన్నా రోలు వైపే జనం ఆసక్తి ..

  • రోలు కల్చరే ముద్దు
  • రోలే కావాలి
  • – నాటి నుంచి కొనసాగుతున్న విధానం
  • – మారుతున్నది కేవలం సైజు మాత్రమే
  • – గ్రైండర్ల కన్నా రోలు వైపే జనం ఆసక్తి

హైదరాబాద్, మహా: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకు మనిషి ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పలు మార్పులు చేర్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ముఖంగా పలు ఆచారాలు, వస్తువులు ఉన్నాయి. వాటిని మారుతున్న కాలమనుసారం మారుస్తూ తమ పనులను సులువు చేసుకుంటున్నారు జనాలు. దీంతో వారికి సమయం వృథా కాకుండా తమ పనులు చక్కబడిపోతున్నాయి. దీంతో ప్రజలు వాటిని అనుసరిస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో ఉన్నాయి. అయితే, ఎన్ని మారుతున్నా కొన్ని మాత్రం మారడంలేదు. నాటి నుంచి కొనసాగుతున్న పద్ధతులు, వస్తువులే ఇంకా కొనసాగుతున్నాయి. వీటిల్లో ఏమైనా మార్పులు చేశారంటే చిన్న చిన్న మార్పులు తప్ప పెద్దగా వాటిని మార్చలేదు. కానీ, వాటిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కారణం ఏమంటే.. వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీంతో వాటిని ప్రస్తుత కాలంలో కూడా ఉపయోగించేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటివాటిల్లో ఒకటి రోలు. రోలు నాడు పల్లెటూర్లలో ప్రతి ఇంటి వద్ద పెద్ద పెద్ద సైజులో కనిపించేవి. కానీ, ఇప్పుడు పల్లెటూర్లలో కాదు.. పట్నంలో కూడా ప్రతి ఇంటిలోని వంటి రూంలో కనిపిస్తున్నాయి. కాకపోతే వాటి సైజు మారింది. వారికి అవసరమైన సైజులో వాటిని తెచ్చుకుని వాడుతున్నారు. నగరంలో రోడ్లపై చాలా ప్రాంతాల్లో కూడా విక్రయ దారులు వాటిని పలు రకాల రాయితో తయారు చేసి విక్రయిస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో రోల్లు అమ్ముతున్నవారు కనిపిస్తుంటారు. పలువురు వీధుల్లోకి వచ్చి కూడా వాటిని విక్రయిస్తుంటారు.

 

గతంలో అయితే ఈ రోలు చాలా పెద్ద సైజులో ఉండేవి. రోలులో ఏమైనా వస్తువులను.. అవసరమైన కూరగాయలు, పచ్చళ్లు.. ఇలా ఏది నూరాలనుకుంటే వాటిని నూరుకునేవారు. అందుకోసం ఒక రోకలి బండను ప్రత్యేకగా కట్టెతో చేయించుకునేవారు. గతంలో గ్రైండర్స్ లేనందున ఈ రోలులోనే వారికి ఏం కావాలన్నా నూరుకునేవారు. అందుకు రోకలి బండ ప్రధానంగా సహాయపడేది. రోలులో నూరిన పచ్చల్లు గానీ, ఇందులో నూరిన వస్తువులతో చేసిన వంటకాలు గానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందుకే చాలామంది ఇప్పుడు కూడా గ్రైండర్ల కన్నా రోలునే వాడుతున్నారు.

 

పట్నంలో కూడా ఇదే కల్చర్

నాటి విధానమే పట్నంలో కూడా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికీ ఏ ఇంటిలో చూసినా కూడా రోలులే దర్శనమిస్తుంటాయి. కాకపోతే వాటి సైజు మారుతుంది తప్ప రోలుల కల్చర్ మారడంలేదు. చిన్న సైజులో ఉన్న రోలులను ఎక్కువగా వాడుతున్నారు. ఆ రోలులో అప్పుడు రోకలి బండ ఉండేది. కానీ, ఇప్పుడు వాటిని కూడా రాయితోనే తయారు చేస్తున్నారు. రోలు, రోకలి బండ కూడా చిన్న సైజులోనే తయారు చేస్తున్నారు. దీంతో మోయడానికి ఈజీగా, వాటిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచేందుకు వీలుగా ఉంటున్నాయి. వారికి అవసరం వచ్చినప్పుడు.. అంటే ఎప్పుడు వంట చేసే సమయంలోనే వారికి అవసరమున్నవాటిని వాటిల్లో నూరి వంటల్లో వాడుతున్నారు. ఇలా చేస్తే వంట రుచిగా ఉంటదని పలువురు చెబుతున్నారు. అందుకే రోలును ఇంకా ఫాలో అవుతున్నామని చెబుతున్నారు.

 

రోలులో దంచే వస్తువులు..

రోలులో ఎక్కువగా అల్లం, వెల్లుల్లి, ధన్యాలు, మసాలల, పచ్చళ్లతోపాటు ఇతర వస్తువులను ఇందులో దంచుతారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share