Mahaa Daily Exclusive

  సర్పంచ్ దారుణ హత్య….

Share

*సర్పంచ్ దారుణ హత్య….*

*సింగారం గ్రామంలో విషాదం*

వరంగల్ మహా;

మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి ముందు వరండాలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాల పై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..