Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్‌లో ప్రజా సమస్యలపై స్పందించిన MGR.. AK ఎన్‌క్లేవ్‌లో రోడ్డు, స్ట్రీట్‌లైట్లు, పార్క్ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు…..

Share

సమస్యలపై సమరంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర డివిజన్‌లోని AK ఎన్‌క్లేవ్ లో గత కొద్ది రోజులుగా వాటర్ వర్క్స్ అధికారులు పైప్‌లైన్ పనుల కోసం సగం రోడ్డు తవ్వి సగం రోడ్డు అలాగే వదిలేయడంతో కాలనీవాసులు, బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

ఈ సమస్యపై సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు ఈరోజు ఉదయం ప్రాంతాన్ని పర్యటించారు.

 

ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు సరిగా వెలగకపోవడం, పార్క్ శుభ్రత లేకపోవడం, అలాగే రోడ్డు తవ్వకాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

 

ప్రజల సమస్యలను వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో MGR గారు మాట్లాడి తక్షణ చర్యలు తీసుకునేలా చేసి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.

 

 

ఈ కార్యక్రమంలో సలీం భాయ్, ఇంతియాజ్, ఫయాజ్ జుబెర్, అయూబ్ ఖాన్, బాలు, నవీన్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Latest