Mahaa Daily Exclusive

  వైద్య సిబ్బందికి బీపీ, షుగర్ మిషన్లు అందజేత..

Share

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం గ్రామపంచాయతీ ప్రజల వైద్య పరీక్షలకు సర్పంచ్ కోరం కోటమ్మ బీపీ, షుగర్ లెవల్ పరీక్షించే మీషన్లను కొనుగోలు చేయించారు. పంచాయతీ తరుపున కొనుగోలు చేసిన యంత్రాలను బుధవారం వైద్య సిబ్బదికి అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించటానికి ఈ యంత్రాలు ఎంతో ఉపయోగకరమని సర్పంచ్ కోటమ్మ తెలిపారు. వర్షకాలం నేపధ్యంలో పారిశుధ్యంపై దృష్టి పెట్టి నీరు నిల్వ లేకుండా చూస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. వైద్య పరికరాలు అందించటం పట్ల వైద్య సిబ్బంది, సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Latest