కారేపల్లి, మహా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి దివంగతవైఎస్ రాజశేఖర్ రెడ్డి 77 జన్మదిన వేడుకలు సోమవారం సింగరేణి కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సినిమా హాల్ సెంటర్ లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు ఆధ్వర్యంలో సైతం వైఎస్ జయంతిని జరిపారు. ఈసందర్బంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన పధకాలు పేదల గుండెలలో చిరస్ధాయిగా నిలిచాయన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంట్, విద్యార్ధులకు ఫీజు రియాంబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇండ్లు, రూ.1 రేషన్ బియ్యం వంటి పధకాలు భారత దేశ వ్యాప్తంగా దిక్చూచిగా మారాయన్నారు. ఆయన అడుగుజాడలలో నేటి ప్రభుత్వం ప్రయణిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, జిల్లా కార్యదర్శి బానోత్ రామ్మూర్తినాయక్, జిల్లానాయకులు తలారి చంద్రప్రకాష్, సురేందర్ మనియార్, మల్లెల నాగేశ్వరరావు, గుగులోత్ భీముడునాయక్, సూరపురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ లు మేదరి వీరప్రతాఫ్ (టోనీ), బానోత్ హీరాలాల్, వాంకుడోత్ హనుమంతరావు, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, హనీఫ్, నాయకులు బొల్లా రమేష్ తాజుద్దీన్, బానోత్ రూప్లనాయక్, నాగులు, చాగంటి వెంకటేశ్వర్లు ఈర్య, షఫీ, చాంద్ పాషా, వినోద్, దేవుసింగ్, యాకుబ్ అలీ, షేరు, వాంకుడోత్ గాంధీ, తొగరు శ్రీను,అజ్మీర రవి తదితరులు పాల్గొన్నారు








