Mahaa Daily Exclusive

  నవలిమిటెడ్ ఎల్.వి.పి.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి వైద్య సేవలు ….

Share

భద్రాద్రి కొత్తగూడెం, మహా:

పాల్వంచ నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా నవలిమిటెడ్, ఎల్.వి.పి.ఐ సంయుక్తంగా పాల్వంచ ప్రభుత్య పాఠశాలల విద్యార్థులకు మండల పరిషత్ హైస్కూల్ ఎర్రగుంట నందు

బుధవారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా డి.వాసంతి, జిల్లా విద్యశాఖధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలల అభివృద్ధికి మౌలిక సదుపాయలు కల్పించడంలో ‘నవ’ లిమిటెడ్ కృషిని కొనియాడారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ యన్ సురేష్ చంద్ర, ఎల్.వి.ప్రసాద్, అడ్మినిస్ట్రేటర్ సి.దేవి చంద్రరావు, సి.ఎస్.ఆర్ మేనేజర్

సి.హెచ్.శ్రీనివాసరావు, పాఠశాల హెచ్.ఎమ్ పి.సుధారాణి, పాఠశాల సిబ్బంది,

సిఎస్.ఆర్ సిబ్బంది, నవభారత్ కంటి వైద్య సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Latest