Mahaa Daily Exclusive

  ఆగస్టు 15వ తేదీలోగా ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం..!

Share

  • ఆగస్టు 15వ తేదీలోగా
  • ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం
  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • విద్యార్థులకు, ప్రైవేట్ కళాశాలలకు కొంత ఊరట

హైదరాబాద్, మహా : ఈ ఏడాదికి సంబంధించిన సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఆగస్టు 15 లోగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 2, 3, 4వ సంవత్సరం విద్యార్థులకూ ఫీజు చెల్లిస్తామని పేర్కొంది. ఫీజు రీయింబర్స్మెంట్పై హైకోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఈ స్పష్టత వచ్చింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదంటూ పలు ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ బకాయిలు దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందన్నారు. 2023 నుంచి ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. తర్వాత కొంత గడువుతో మిగతా బకాయిలు చెల్లించేలా చూడాలని హైకోర్టును కోరారు. గత విచారణలో జీవో9లో నాలుగు నిబంధనలపై షరతు విధించింది. అందులో కొన్ని నిబంధలపై విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్టే వల్ల కొత్తగా చేరిన విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.

 

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయవద్దంటూనే గడువు కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు విద్యార్థుల అకౌంట్లలో జమయ్యాక వారు చెల్లించకపోతే బకాయిల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందో లేదో చెప్పాలని వారు ప్రశ్నించారు. రూ.2,800 కోట్ల బకాయి ఉండగా రూ.250 కోట్లు మాత్రమే కేటాయింపు చేశారని పేర్కొన్నారు. గత బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ అడ్మిషన్లు ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. ఫీజు చెల్లించనట్లయితే అడ్మిషన్‌లను కాలేజీలు నిరాకరిస్తున్నాయని హైకోర్టుకు వివరించారు. మధ్యంతర ఉత్తర్వుల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు చెల్లించలేక నష్టపోయే ప్రమాదం ఉందని వాదనలు వినిపించారు.

Latest