Mahaa Daily Exclusive

  ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ దరఖాస్తుల గడువు పొడిగింపు.

Share

 

హన్మకొండ మహా;

హైదరాబాద్‌లోని షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ–2027) ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌ కు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును జూలై 19 వరకు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె. జగన్ మోహన్ గారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వికలాంగుల వర్గాల డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ అభ్యర్థులు జూలై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 26 న ఆదివారం రోజున ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హన్మకొండ నందు ఉదయం ప్రవేశ పరీక్ష ఉంటుంది అని డాక్టర్ కె. జగన్ మోహన్ కోరారు.
దరఖాస్తు పూర్తి వివరాలకు క్రింద ఉన్న వెబ్ సైట్ నందు చూడగలరు http://tsstudycircle.co.in