మహబూబాబాద్, మహా;
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి శివారు సోమవరపుకుంట తండాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) పాము కాటుకు గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం బుధవారం రాత్రి భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్ లో కింద నిద్రిస్తున్న క్రమంలో రాత్రి 11 గంటలకు కట్ల పాము మేడ నరంలో కాటు వేయడంతో వెంటనే లేచి కాటు వేసిన పామును చంపేశాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వెళ్లి ఇంజక్షన్ వేయించాలని కోరిన ప్రవీణ్ ఏమి కాదని నిర్లక్ష్యం చేసి పడుకోవడంతో రాత్రి ఒంటిగంటకు వాంతులు,విరోచనాలు కావడం వల్ల చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడు ప్రవీణ్ చిన్న వయసులోనే తండ్రి బానోతు లాల్ సింగ్ మృతి చెందాడు. తల్లి బానోతు రంగమ్మ, భార్య మమత, ఐదుగురు అక్కలు ఉన్నారు.
Post Views: 13







