Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పై బిజెపి పోరాటం…

Share

*కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పై బిజెపి పోరాటం*

*కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనను ఎండ గడతాం*

*బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి*

*వరంగల్ అభివృద్ధే బీజేపీ లక్ష్యం*

*కాంగ్రెస్ హయాంలో వరంగల్ అభివృద్ధి శూన్యం*

*వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్*

వరంగల్, బ్యూరో మహా ;

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం వరంగల్ లోని సుశీల్ గార్డెన్స్‌ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి దిశానిర్దేశం చేశారు. సమావేశ ప్రాంగణంలో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రైతుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉండి పోరాటాలు చేస్తోందని బీజేపీ పార్టీ స్పష్టం చేశారు.

-గతంలో మరియు ప్రస్తుతం జిల్లాలో బీజేపీ చేపట్టిన ఎంజీఎం, అని మనము మోడల్ బస్టాండ్, జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్, నగర అభివృద్ధికై వంటి అంశాలపై కీలక పోరాటాలు, ప్రజా సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

*మేయర్ పీఠమే లక్ష్యంగా*

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

*-రైతు గోస బీజేపీ భరోసా తీర్మానం*

జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు, “రైతు గోస బీజేపీ భరోసా” రైతులు పడుతున్న గోసపై, రైతు సమస్యలపై నిరంతర పోరాటాలు చేసేందుకు ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం ఆమోదించారు.

*-సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయాస్*

భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గడిచిన 12 సంవత్సరాల చారిత్రాత్మక సుపరిపాలనపై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా అభినందన తీర్మానం ఆమోదించింది. ఈ 12 ఏళ్ల కాలం భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలపడమే కాకుండా, పేదల సంక్షేమమే పరమావధిగా సాగిందని తీర్మానం కొనియాడింది.

*-రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం*

ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు మరియు హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన పథకాల అమలు నత్తనడకన సాగుతోందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమించాలని సూచించారు.

-రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించారు. వరంగల్ నగరంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెండింగ్ స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు

-ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

*కార్యకర్తలకు దిశానిర్దేశం*

పార్టీ బలోపేతంలో నాయకులు, కార్యకర్తల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా బూత్‌ను గెలవాలని, అందుకే ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చాను.
అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రతి దశలో క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, డాll వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్ రావు, రత్నం సతీష్ షా, గురుమూర్తి శివకుమార్, సిద్ధం నరేష్, జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, గందె నవీన్, రామచంద్రారెడ్డి, నరసింహ రాములు, తాబేటి వెంకట్ గౌడ్, మంజుల రెడ్డి, కౌన్సిలర్ జూలూరి రోజారాణి, సర్పంచులు తాళ్లపెళ్లి కుమారస్వామి, శ్రీరామ్ భూపాల్, రాయపురం రమ్యారాజు మరియు జిల్లా పదాధికారులు, వివిధ మోర్చ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.