- పరామర్శ అంటే ఇదేనా?
- మండిపడ్డ మంత్రి పార్ధసారధి
- ప్రశాంతతను చెడగొట్టేందుకే జగన్ టూర్
అమరావతి, మహా : వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యం పరామర్శ కాదని, అక్కడున్న ఆనందకర పరిస్థితులను భగ్నం చేయడమేనని మంత్రి పార్థసారథి అన్నారు. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన తీరుపై ఆయన స్పందించారు. ఆంక్షలు ఉన్నపటికీ వేలాది మంది నేతలు, కార్యకర్తలతో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. రణస్థలం మండలం పైడిభీమవరంలో మహిళా ఎస్ఐను దూషించడంపై పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎస్సై అని కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. టూర్ పేరు చెప్పి అరాచకాలకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జగన్ పరామర్శ యాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు1న ప్రధాని మోడీ వస్తున్నారని, ఒక రోజు ముందే కావాలని జగన్ పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో భయానక వాతావరణాన్నిసృష్టించేందుకు జగన్ పర్యటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






