Mahaa Daily Exclusive

  జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టు సంఘాల నాయకులు..

Share

 

హనుమకొండ, మహా;

ప్రముఖ దినపత్రిక కు చెందిన కాశిబుగ్గ సీనియర్ రిపోర్టర్ కిరణ్ తండ్రి
వెంకటయ్య శనివారం ఉదయం పరకాల మండలం నాగారం లోని వారి స్వగృహంలో మృతిచెందారు. ఈ సందర్భంగా వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు వెంకటయ్య మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, టీయూడబ్ల్యూజే-143 జిల్లా అధ్యక్షుడు, వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్, టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, వివిధ యూనియన్ల బాధ్యతలు వ్యవహరిస్తున్న సహచర జర్నలిస్ట్ లు టీవీ-5 రిపోర్టర్ బండి రవి, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పూర్ణ, టీ న్యూస్ రిపోర్టర్ నీలం శివ,బందెల కృష్ణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.