*మన “పల్లె మట్టి నుండి ప్రపంచ మార్కెట్” వైపు: ఒక “రైతు విజయ గాథ”..!*
“రామయ్య” గారు ఒక సామాన్య రైతు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ, కేవలం తనకున్న పరిమిత జ్ఞానంతోనే పంటలు పండిస్తూ.. తన చెమట చుక్కలకు తగిన ధర దక్కడం చాలా కష్టంగా మారి, ప్రతి రోజూ మార్కెట్ అనే ఆకాశం వైపు ఆశగా చూసేవారు.
అప్పుడే అతని చీకటి జీవితంలోకి ఒక ఆశాకిరణంలా *”సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ స్కూల్ (సి.ఎస్.ఎస్)”* ప్రవేశించింది. *వాల్యూ చైన్ ఎక్స్పర్ట్, వ్యవసాయ నిపుణులు అయిన “రోజా చంద్ చిలువేరు”* గారు ఈ అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఒక బడిలో విద్యార్థులు ఉపాధ్యాయుడి నుండి పాఠాలు, జ్ఞానాన్ని ఎలా నేర్చుకుంటారో, అదే విధంగా ఈ సి.ఎస్.ఎస్ ద్వారా రైతులు అంతర్జాతీయ ఉత్పత్తి ప్రమాణాలు, ఉత్తమ వ్యవసాయ పద్ధతుల గురించి నేర్చుకోవడం ప్రారంభించారు. ఈ విధానం ఉత్పత్తి నుండి మార్కెటింగ్ వరకు ప్రతి దశలో రైతులకు అవగాహన కల్పించింది.
వ్యవసాయం అంటే కేవలం విత్తనం చల్లడం కాదు, అదొక బాధ్యతాయుతమైన వ్యాపారం అని రామయ్య తెలుసుకున్నారు. ఈ ప్రయాణంలో వివిధ భాగస్వాముల నుండి ఎంతో జ్ఞానాన్ని పొందారు.
* అధికారిక సంస్థలు సిఫార్సు చేసిన, అనుమతించబడిన మోతాదులో మాత్రమే మందులు వాడటం నేర్చుకుని భూమాతను రక్షించుకున్నారు.
* రోజువారీ క్షేత్రస్థాయి పరిశీలనలను గమనిస్తూ, వ్యవసాయ ఖర్చులను కచ్చితంగా నమోదు చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకున్నారు.
*సర్టిఫికేషన్ బాడీలు కూడా క్షేత్ర స్థాయిలో వీరి ద్వారా జరిగిన వాస్తవ పనిని అంచనా వేసి, అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం కావడానికి ఎంతగానో సహాయపడ్డాయి.
అంతర్జాతీయ ప్రమాణాలు – కమ్యూనిటీ సర్టిఫికేషన్ విధానం
రామయ్య సర్టిఫైడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకుని తన వ్యవసాయ పద్ధతిని మార్చుకోవడం జరిగింది. వీలయినంత వరకు ఎరువులు, పురుగుమందులు చాలా వరకు మానివేసి చేసే ‘ఆర్గానిక్ సర్టిఫికేషన్’ విధానం లేదా అనుమతించబడిన కనీస మోతాదులో మాత్రమే రసాయనాలు వాడే ‘ఎమ్.ఆర్.ఎల్’ (మినిమం రెసిడ్యూ లెవల్) ఫార్మింగ్ పద్ధతులను ఆయన అర్థం చేసుకున్నారు.
మార్కెట్ అవసరాలను బట్టి, రైతులు పండించే పంటల ఆధారంగా ప్రపంచస్థాయిలో అనేక ‘ఎమ్.ఆర్.ఎల్’ మరియు సుస్థిర వ్యవసాయ (సస్టెయినబుల్) సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
*రెయిన్ ఫారెస్ట్ అలయన్స్
*గ్లోబల్ గ్యాప్ (జి.ఎ.పి)
*బెటర్ కాటన్ ఇనిషియేటివ్ (బి.సిఐ)
*ఆర్ఎస్పిఓ (రౌండ్ టేబుల్ ఆన్ సస్టెయినబుల్ పామాయిల్)
*రీజెనరేటివ్ అగ్రికల్చర్
*ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్
*సస్టెయినబుల్ సోయా
*గాట్స్ (జి.ఒ.టి.ఎస్ – గ్లోబల్ టెక్స్ టైల్ స్టాండర్డ్)
*సస్టెయినబుల్ రబ్బర్
ఈ సర్టిఫికేషన్లను వ్యక్తిగతంగా కాకుండా, అవసరాల మేరకు కమ్యూనిటీ లేదా గ్రూప్ స్థాయిలో అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా రైతులందరూ ఒక బృందంగా ఏర్పడి సర్టిఫికేషన్ సాధించడం వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా, సమష్టిగా నాణ్యతను సాధించవచ్చు. ఈ విధానాన్ని పాటిస్తూనే రామయ్య తన పంటను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు “రెయిన్ ఫారెస్ట్ అలయన్స్ సర్టిఫికేషన్” ను ఎంచుకోవడం జరిగింది.
నిజానికి ఈ సర్టిఫికేషన్ సాధించడం అనేది అంత సులభమైన పని కాదు, దానికి వివిధ స్థాయిలలో నిపుణుల మద్దతు అవసరం. ఎటువంటి రిజెక్షన్స్ లేకుండా తమ పంటను అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి రామయ్య లాంటి రైతుల బృందం అహర్నిశలు సమన్వయంతో కష్టపడ్డారు. చివరగా, ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ వారు పండించిన నాణ్యమైన పంటను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి గొప్ప మద్దతునిచ్చారు.
భారతదేశంలో, ముఖ్యంగా మహారాష్ట్రలోని ద్రాక్ష ఎగుమతుల వ్యవస్థ అక్కడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఎలా సహాయపడిందో అధ్యయనం చేసిన రామయ్య బృందం, అదే స్ఫూర్తితో తమ సొంత ఎకోసిస్టమ్‌ను నిర్మించుకున్నారు.
ప్రపంచ మార్కెట్ తలుపులు తడుతున్న పర్యావరణహిత వ్యవసాయం
సాంప్రదాయ వ్యవసాయం నుండి పర్యావరణహిత సర్టిఫికేషన్ల వైపు అడుగులు వేయడం ద్వారా రైతులు ప్రపంచ మార్కెట్లను ఎలా శాసించగలరో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఇ.పి) కూడా స్పష్టం చేసింది. ఇలాంటి సర్టిఫికేషన్ల ద్వారా పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా, రైతులకు మెరుగైన ఉపాధి ఎలా లభిస్తుందో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి:
> UNEP: Crop certification going green unlocks global markets for farmers
>
ఒకప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న రామయ్య కళ్లలో ఇప్పుడు గర్వం కనిపిస్తోంది. సరైన విద్య, సర్టిఫికేషన్, సమిష్టి కృషితో ఒక సామాన్య రైతు కూడా ప్రపంచాన్ని జయించగలడని, తన పంటతో ఖండాంతరాలను దాటగలడని ఈ ప్రయాణం నిరూపించింది. ఇది కేవలం ఒక రైతు సాధించిన విజయం కాదు, సాంకేతికతను, అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకున్న ప్రతి అన్నదాత సాధించిన అద్భుత ఘనత!
(మరిన్ని వివరాలకు గ్రీన్ గురుకులం, వాల్యూ చైన్ ఎక్స్పర్ట్, వ్యవసాయ నిపుణులు, సి.హెచ్.రోజా చంద్ ని సంప్రదించగలరు. 99893 35374)







