- వరంగల్ తూర్పు రాజకీయాల్లో సంచలనం
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరాటే ప్రభాకర్ జనసేన లో చేరిక
- పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా – వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు షాక్
- తెలంగాణ వ్యాప్తంగా ఇతర పార్టీల నేతల జనసేన బాట
వరంగల్, బ్యూరో మహా;
తెలంగాణ రాష్ట్రంలో “ఆపరేషన్ పవర్” స్టార్ట్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జన సేనాని ఓ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరాటే ప్రభాకర్ శనివారం జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జనసేన రథసారధి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకుని పార్టీలో అధికారికంగా చేరారు.
*కరాటే ప్రభాకర్ ఎవరు?*
కరాటే ప్రభాకర్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రెండు దశాబ్దాలుగా కీలకంగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవికి వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుల్లో ఒకరు.
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయనతో కలిసి పనిచేశారు. వరంగల్ జిల్లాలో చిరంజీవి అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య మంచి పట్టు ఉంది.
కరాటే అనే పేరుతో యువతలో ప్రజాదరణ ఉంది. అనేక సామాజిక సేవా కార్యక్రమాల తోనూ ఆయనకు మంచి పేరుంది. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయానికి ఇతడు ముఖ్య పాత్ర పోషించాడు.
*పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం*
శనివారం హైదరాబాద్‌లో జరిగిన చేరికల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా కరాటే ప్రభాకర్‌కు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “ప్రజా సమస్యల పై పోరాడే నాయకులు జనసేనకు బలం. కరాటే ప్రభాకర్ లాంటి సీనియర్లు రావడం పార్టీకి శుభం అని అన్నారు.
అనంతరం కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తాను. జనసేన సిద్ధాంతాలతో నేను ఏకీభవిస్తున్నాను” అని తెలిపారు.
*కాంగ్రెస్ కు షాక్ – తెలంగాణ వ్యాప్తంగా చేరికలు*
కరాటే ప్రభాకర్ చేరికతో వరంగల్ తూర్పు కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలినట్లైంది. గత ఎన్నికల్లో ఆయన కీలకంగా పనిచేశారు.
ఇతనితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల నుండి ఇతర పార్టీలకు చెందిన నేతలు, నాయకులు కూడా జనసేనలో చేరారు.
ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు పవన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు.
జనసేన తెలంగాణలో పుంజుకుంటోందని, పవన్ కళ్యాణ్ పేరుతో యువత, అభిమానులు పెద్ద ఎత్తున పార్టీ వైపు వస్తున్నారని జనసేన నాయకులు చెప్తున్నారు.
*రాజకీయ విశ్లేషణ*
వరంగల్ తూర్పులో ప్రభావం కరాటే ప్రభాకర్ చేరికతో వరంగల్ తూర్పులో జనసేనకు బలం పెరిగింది. మెగా అభిమానుల ఓట్లు జనసేన వైపు మళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు భావిస్తున్నారు.
*చిరు – పవన్ కుటుంబ రాజకీయాలు*
మెగాస్టార్ సన్నిహితుడే పవన్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
*తెలంగాణలో జనసేన విస్తరణ*
స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇతర పార్టీల నుండి నాయకులు రావడం జనసేనకు కలిసొచ్చే అంశం.
మెగాస్టార్ సన్నిహితుడు, కరాటే ప్రభాకర్ జనసేనలో చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో జనసేన ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.







